ప్రకటన ఎప్పుడైనా రావొచ్చు..
భారీగా పోస్టుల భర్తీ
టీఎస్ పీఎస్సీ కీలక నిర్ణయం
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: రాష్ట్రంలో గ్రూపు-1 ఉద్యోగాల నోటిఫికేషన్ జారీకి అంతా రెడీ అయింది. నేడో రేపో ప్రకటన విడుదలకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. నోటిఫికేషన్, ఇతర సమస్యలపై శనివారం టీఎస్పీఎస్సీ సమావేశమైంది. 19 ప్రభుత్వ శాఖల్లోని 503 ఖాళీల భర్తీపై అందిన ప్రతిపాదనలన్నింటినీ బోర్డు క్షుణ్నంగా పరిశీలించి ఆమోదం తెలిపింది. ఆయా పోస్టులకు విద్యార్హత, వయసు తదితర అంశాలను పరిశీలించింది. అయితే మరో మూడు అంశాలపై ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉంది.
భారీగా పోస్టులు
గ్రూపు-1 నోటిఫికేషన్ రాష్ర్టంలో మొదటిగా నిలువనుండడంతో ఇందులో అత్యధిక పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ ఇప్పటికే సంబంధిత ముసాయిదాను సిద్ధం చేసుకుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు పెరగడంతో ఏకంగా 503 ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. ఇంటర్వ్యూలు లేనందున తొమ్మిది నెలల్లో ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు పూర్తిచేసి పోస్టింగ్లు ఇవ్వాలని కమిషన్ భావిస్తోంది.
Recent Comments