గణపురం ఎస్సై సస్పెన్షన్..?
ములుగు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
ఎస్పీతో మాట్లాడిన ఎమ్మెల్సీ సిరికొండ..
గణపురం చేరుకున్న యువనేత సిరికొండ ప్రశాంత్
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో యువకుడి మృతి క్షణక్షణం తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తోంది. ఎస్సై కొట్టడం వల్లే తమ కొడుకు ఆత్మహత్యకు యత్నించాడని ప్రశాంత్ తండ్రి ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశాంతం శనివారం ఉదయం మృతి చెందండంతో మండలం మొత్తం అట్టుడికిపోతున్నది. పోలీసుల బలగాలు మోహరించడం, ఆందోళనలు జరిగే అవకాశం ఉందని తెలియడంతో.. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలోనే ఉంచారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ఎస్పీతో మాట్లాడారు. తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో ఆయన ఎస్సై ఉదయ్ కుమార్ ను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే..ఇప్పటికే ఎస్సై ఉదయ్ కిరణ్ పై ములుగు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. యువకుడి మృతి విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ యువనేత సిరికొండ ప్రశాంత్ సుమారు 500 మందితో మండల కేంద్రానికి చేరుకున్నారు.
గణపురం ఎస్సై సస్పెన్షన్..?
RELATED ARTICLES
Recent Comments