స్పాట్ వాయిస్ దామెర: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు పదేళ్లపాటు పాఠశాలతో గల అనుబంధాన్ని సహచర విద్యార్థులు, ఉపాధ్యాయులతో గుర్తుచేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నానరు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు,వీడ్కోలు పత్ర పఠనం అలరించాయి. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ శోభారాణి, సృష్టి హాస్పిటల్ వారి ఆధ్యర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడులు,పెన్నులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సర్పంచ్ గురజాల శ్రీ రామ్ రెడ్డి హాజరై విద్యార్థులకు భవిష్యత్ మార్గ నిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయుల బృందం,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments