బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్
స్పాట్ వాయిస్ నర్సంపేట: ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి చేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ డిమాండ్ చేశారు. శనివారం నర్సంపేట పట్టణ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద ధర్నా చేశారు. అనంతరం ప్రశాంత్ మాట్లాడుతూ.. నర్సంపేట మండలం లక్నేపల్లికి చెందిన అనూష కాకతీయ యూనివర్సిటీ లో ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతోందన్నారు. అటువంటి విద్యార్థిపై సంగెం మండలానికి చెందిన అజార్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో దాడి చేయడం దారుణమన్నారు. వెంటనే నిందితుడిని కఠినంగా శిక్షించి అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సంధ్య, సీమ, కృష్ణవేణి, కీర్తన, కవిత, మౌనిక, సంధ్య, త్రివేణి, లలిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఉన్మాదిని కఠినంగా శిక్షించాలి
RELATED ARTICLES
Recent Comments