సేవలకు గుర్తింపుగా జాతీయ సేవా పురస్కారం
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలుస్తున్న అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ కు అరుదైన గుర్తింపు లభించింది. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ అందిస్తున్న సేవలకు జాతీయ సేవా పురస్కారం వరించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, క్రీడాకారులు, ఎంతో మంది నిరుపేదలకు వారి అవసరాలకు అనుగుణంగా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్న అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ కు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ సేవా పురస్కారాన్ని ప్రకటించింది. ఈ పురస్కారాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలిసి అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఫౌండర్, టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, చైర్మన్ అరూరి విశాల్ కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ అందిస్తున్న సేవలను అభినందించారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ పేద ప్రజల కష్ట సుఖాలలో అండగా నిలవాలని సూచించారు. ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తున్న ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్ ను ప్రత్యేకంగా అభినందించారు.
అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ కు అరుదైన గౌరవం..
RELATED ARTICLES
Recent Comments