సీసీ రోడ్లు, డ్రైనేజీల కోసం ప్రతిపాదనలు చేయాలి
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
కారల్ మార్క్స్ కాలనీలో పర్యటన
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కారల్ మార్క్స్ కాలనీలో శనివారం ఉదయం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలనీవాసులను సమస్యలు అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అవసరమైన చోట సైడ్ డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి, పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మంచి నీటి సమస్య ఉందని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని ప్రతి ఇంటికీ అందించాలని, మిషన్ భగీరథ పనులు పూర్తి స్థాయిలో పూర్తయ్యేవరకు కాలనీవాసులకు సింగరేణి సంస్థ ద్వారా నీటిని అందించాలని సింగరేణి అధికారులను ఫోన్ ద్వారా మాట్లాడి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకటరాణి సిద్దూ, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు సజ్జనపు స్వామి, ఎడ్ల మౌనిక శ్రీనివాస్ కరాటే, ముంజాల రవీందర్ గౌడ్, నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, బీబి చారి, కొక్కుల తిరుపతి, తుమ్మేటి రఘోత్తం రెడ్డి, పట్టణ కమిటీ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments