కావాలనే కేసు తీవ్రతను పెంచారు..
వినయ్ భాస్కర్అణచివేతపై పోరాటం చేస్తా..
ఎదుగుదల ఓర్వలేకే తొక్కే ప్రయత్నమిది..
తప్పు నిరూపిస్తే ముక్కు నేలకు రాకుతా..
టీఆర్ఎస్ ముఖ్యనేత, న్యాయవాది గుడిమళ్ల రవికుమార్
స్పాట్వాయిస్, హన్మకొండ: ‘‘నాపై చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కావాలనే కుట్ర చేస్తున్నాడు. నేను ఏ తప్పు చేయలేదు. చేసిన తప్పును నిరూపిస్తే చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా.., అనవసరంగా నన్ను రిమాండ్ తరలించేందుకు దాస్యం పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు.., తప్పకుండా వినయ్భాస్కర్కుట్రలపై తిరుగుబాటు చేస్తా..’’ అని టీఆర్ఎస్ ముఖ్యనేత, న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ ఆరోపించారు. న్యాయవాదుల కో ఆపరేటివ్ సొసైటీ భూముల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డాడన్న కేసులో సుబేదారి పోలీసులు శుక్రవారం రవికుమార్ ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద న్యాయవాదులను ఆదుకోవాలనే ఉద్దేశంతో 2014లో కాజీపేట మండలం మడికొండలో 31 ఎకరాల ప్రైవేటు పట్టా స్థలాన్ని గజం రూ.1200 కే 300 మందికి ప్లాట్లుగా కేటాయించినట్లు చెప్పారు. అలాగే, న్యాయవిహార్ పేర కో ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి, రూ.10 వేలు తీసుకుని సభ్యత్వాలు ఇచ్చామన్నారు. కాగా, పలు అంశాల ప్రాతిపదికన ప్లాట్ల కేటాయింపులు చేశామని, ఈ క్రమంలోనే కొందరికి ఇవ్వలేకపోయామన్నారు. కేవలం సభ్యత్వానికి డబ్బులు కట్టి ప్లాట్లు అడుగుతున్నారని, ప్లాట్లు దక్కని వారి డబ్బులు తిరిగి ఇస్తామని కూడా చెప్పినట్టు రవికుమార్ తెలిపారు. స్థలాల కేటాయింపుల్లో ఎక్కడా అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని, తప్పు చేసినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాయడానికి కూడా వెనకాడని రవికుమార్ స్పష్టం చేశారు.
కుట్రను తిప్పికొడుతా..
సివిల్ కేసుని, క్రిమినల్ కేసుగా మార్పించేందుకు వినయ్ భాస్కర్ ఎంతో ఒత్తిడి తెచ్చి ఉంటారని రవికుమార్ ఆరోపించారు. ఈ కేసులో పథకం ప్రకారమే శుక్రవారం అరెస్ట్ చేయించారని, కనీసంగా రెండు రోజులు బెయిల్ రాకుండా అడ్డుకునే కుట్ర దీని వెనక దాగి ఉందని రవికుమార్ ఆరోపించారు. చీఫ్ విప్ తన ఎదుగుదలను చూడలేక, రాజకీయంగా తొక్కేయడానికే యత్నిస్తున్నాడన్నారు. పొలిటికల్ కెరీర్ ను శూన్యం చేసే వినయ్ భాస్కర్ కుట్రలపై పోరాటం చేస్తానని రవికుమార్ తెలిపారు. కాగా, న్యాయవాదుల కో ఆపరేటివ్ సొసైటీ స్థల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడిన కేసులో టీఆర్ ఎస్ నేత, న్యాయవాది గుడిమల్ల రవి కుమార్ ను అరెస్ట్ చేసినట్టు సీఐ రాఘవేంద్ర తెలిపారు. రవికుమార్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు న్యాయవాదుల కో ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి, 500 మంది న్యాయవాదుల నుంచి సభ్యత్వం కోసమంటూ ఒక్కొక్కరి నుంచి రూ.10వేల చొప్పున వసూలు చేశాడన్నారు. కానీ, 300 మందికే ప్లాట్లు కేటాయించి, 200 మందికి ఇవ్వకపోవడంపై అడ్వకేట్ వినోద్ కుమార్ ఫిర్యాదు చేశాడన్నారు. ఈ మేరకు సొసైటీలో జరిగిన మోసంపై దర్యాప్తు చేపట్టి శుక్రవారం గుడిమల్ల రవికుమార్ ను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించినట్టు సీఐ తెలిపారు.
ఇది చీఫ్ విప్ దాస్యం కుట్ర..
RELATED ARTICLES
Recent Comments