ప్రభుత్వానికి సైతం జారీ చేసిన హైకోర్టు
తదుపరి విచారణ 29కి వాయిదా
స్పాట్ వాయిస్, హైదరాబాద్: బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్యపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం, మంత్రి పువ్వాడ అజయ్‌కు హైకోర్టు నోటీసులిచ్చింది. సాయిగణేష్ మృతికి మంత్రి, జిల్లా పోలీసులే కారణమంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాయిగణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. ఈ ఘటనలో 8 మందిని ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. కేసు విచారణలో ఉన్నందున తమకు సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టును కోరారు. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 29కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే సాయిగణేష్ సూసైడ్ ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. ఆయన వైరాలో కమ్మ కళ్యాణం మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఖమ్మంలో చిన్న విషయం జరిగితే దానిని అడ్డం పెట్టుకొని తనపై కుట్ర చేస్తున్నారని అన్నారు. కొంత మంది సూడో చౌదరీలు వారితో చేతులు కలిపి తనపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
Recent Comments