Sunday, June 8, 2025
Homeలేటెస్ట్ న్యూస్హైటెక్ సెక్స్ రాకెట్

హైటెక్ సెక్స్ రాకెట్

కోడ్ ఎంట్రీ చేస్తేనే అలో..
షాక్ అయిన పోలీసులు
స్పాట్ వాయిస్, క్రైం: హైదరాబాద్ మహానగరంలో సరికొత్త సెక్స్ రాకెట్ వెలుగుచూసింది. నయా టెక్నాలజీతో నడుపుతున్న ఈ సెక్స్ రాకెట్లో ఉగాండా దేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్స్ రాకెట్ కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. అక్కడ నలుగురు ఉగాండా జాతీయులను కనుగొన్నారు. వారిలో ముగ్గురు సెక్స్ వర్కర్లు ఉన్నారు. ఇందుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు.. ఒక డేటింగ్ యాప్ ద్వారా కస్టమర్, నిర్వాహకులు సంప్రదింపులు జరిపినట్టుగా తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఈ యాప్ లో ఉన్నవారంతా వీఐపీలే. బ్యాంకు యాప్‌లో సెక్యూరిటీ మాదిరిగా ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఫ్లాట్‌కు వచ్చే విటులు తప్పనిసరిగా ప్రత్యేక కోడ్ వాడితేనే ఎంట్రీ ఉంటుంది. సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేస్తేనే విటులకు అనుమతిస్తారు. ఇంతటి హైటెక్ రీతిలో సెక్స్ రాకెట్‌ని ఇప్పటి వరకు చూడలేదని పోలీసులు విస్మయం చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల డ్రగ్ కేసులోనూ ఇలాంటి యాప్ ను పోలీసులు గుర్తించారు.
కోడ్ షేరింగ్ ఇలా..
కస్టమర్ డబ్బులు చెల్లించడానికి అంగీకరించిన తర్వాత.. మహిళ వద్దకు వెళ్లేందుకు కోడ్‌ను షేర్ చేస్తారు. కస్టమర్ అక్కడి వెళ్లి సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేస్తేనే మహిళతో సెక్స్ చేయడానికి అనుమతి ఉంటుంది. అనంతరం నిర్వాహకులు కస్టమర్ మొబైల్ ఫోన్ నుంచి వారి సంప్రదింపు వివరాలు, ఇతర సమాచారం తొలగిస్తారు. తద్వారా కస్టమర్ ఆ డేటాను దుర్వినియోగం చేయడం లేకుండా.. పోలీసులకు ఎటువంటి సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు సెక్స్ రాకెట్ నిర్వహకులు ఈ విధమైన చర్యలు చేపట్టినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది

RELATED ARTICLES

Most Popular

Recent Comments