Monday, November 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్మంత్రి పుష్కర స్నానం

మంత్రి పుష్కర స్నానం

హాజరైన ఎమ్మెల్యే గండ్ర దంపతులు
స్పాట్ వాయిస్, మహదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ కాళేశ్వరంలో ప్రాణహిత పుష్కరాలకు మంత్రి సత్యవతి రాథోడ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర దంపతులు హాజరయ్యారు. గురువారం ఉదయం కాళేశ్వరం చేరుకున్న వీరు త్రివేణి సంగమం వద్ద పుష్కర స్నానం చేశారు. వీఐపీ పుష్కరఘాట్ కు చేరుకొని త్రివేణి సంగమంలో చీర, సారె, పసుపు, కుంకుమ, పూలు, గాజులు గంగమ్మ తల్లికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి కాళేశ్వర క్షేత్రానికి చేరుకోగా ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకుల సమక్షంలో ముక్తీశ్వరుడికి, శుభనంద అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ స్వామి వారికి శేషవస్త్రాలు సమర్పించారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ అర్చకులు మంత్రికి ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ దివాకర, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఎస్పీ బోనాల కిషన్, తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments