Monday, November 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఆయన శంకుస్థాపనల మంత్రి

ఆయన శంకుస్థాపనల మంత్రి

ప్రభుత్వంపై పంచభూతాలు ఆగ్రహిస్తున్నాయ్..
కేంద్రంపై అక్కసుతోనే ఆరోపణలు
మంత్రి కేటీఆర్ మాటలు సిగ్గుచేటు
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి
స్పాట్ వాయిస్, హన్మకొండ టౌన్: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేసేందుు పంచభూతాలు సైతం సిద్ధంగా ఉన్నాయని, ఇందుకు నిదర్శనమే బుధవారం కుడా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభ టెంట్ కూలడమేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రకృతి సైతం టీఆర్ఎస్ పైపై కన్నెర్ర జేసిందన్నారు. కేటీఆర్ శంకుస్థాపనల మంత్రిగా మారిపోయాడని, గతంలో 60 ఇప్పుడో 20 పనులకు శంకుస్థాపన చేశారన్నారు. టీఆర్ఎస్ నాయకులు సొల్లు పురాణం వాగడం తప్పా వరంగల్ లో వారు చేసిందేమీ లేదన్నారు. రాజ్యాంగం, చట్టంపై కనీస అవగాహన లేని కేటీఆర్ తాను విసిరిన సవాల్ స్వీకరించి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటా 32% నుంచి 41 శాతానికి మోడీ ప్రభుత్వం పెంచిందన్నారు. ఈ మాత్రం అవగానలేక 3,65,797 కోట్లు రాష్ట్రం కేంద్రానికి పన్నుల రూపం లో ఇస్తే రాష్ర్టానికి కేంద్రం నుంచి 1,68,000 కోట్లు ఇచ్చిందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్లు
కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తుందని, ప్రజల సొమ్మును అడ్డదిడ్డంగా నువ్వు అడిగినట్టు పంచదంటూ రాకేశ్ రెడ్డి మండిపడ్డారు. లెక్క ప్రకారం రావాల్సింది ఇస్తుందని, మిగతాది డిఫెన్స్ కోసం ఇతర సంక్షేమ పథకాల కోసం వాడుతుందని చెప్పారు. ఈ కనీస అవగాహన లేని వ్యక్తి మంత్రిగా కొనసాగే నైతిక అర్హత కేటీఆర్ కు లేదన్నారు. కేటీఆర్ పర్యటన మొదట ఊరవతల పెట్టి 25 వేల మందిని తరలిస్తామన్నారు. కథ అడ్డం తిరిగి ఆఖరికి కుడా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారన్నారు. వరంగల్ ఎమ్మెల్యే లు, మంత్రులు అంతా కలిసి పొర్లు దండాలు పెట్టిన ప్రజలు సభకు రావడానికి సుముఖత చూపలేదంటూ ఎద్దేవా చేశారు. బీజేపి పై అక్కసుతో మాట్లాడుతున్నారే తప్ప ప్రజలకేదో చెయ్యాలని వరంగల్ వచ్చినట్టు లేదని ఆరోపించారు. మంత్రి శంకుస్థాపన చేసిన పనుల్లో కేంద్ర నిధులు ఉన్నాయో లేవో చెప్పాలని డిమాండ్ చేశారు. అయ్యను మించి బూతులు మాట్లాడటంలో కేటీఆర్ పీహెచ్ డీ చేస్తున్నటుందన్నారు. గతంలో కేసీఆర్ సీఎం పదవి ఎడమ కాలి చెప్పుతో సమానం అన్నడని, ఇప్పుడు కొడుకు కేటీఆర్ సైతం మంత్రి పదవి ఎడమకాలి చెప్పుతో సమానం అంటున్నాడు. మీ తలపోగరుకు ఇది నిదర్శనమన్నారు. తండ్రికొడుకులిద్దరికీ ప్రజలిచ్చిన బాధ్యత ఎడమ కాలు చెప్పు లెక్క అనిపిస్తుందని, అహంకారానికి వారు బ్రాండ్ అంబాసిడర్లని తెలిపారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడి మంత్రి పదవికి ఉన్న ఔన్నత్యాన్ని దిగజార్చొద్దని సూచించారు. ప్రధానిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడి వరంగల్ సాక్షిగా తెలంగాణ హుందాతనాన్ని కేటీఆర్ దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు స్థానిక జనాలు రారని తెలిసి.. టీఆర్ఎస్ నాయకులే టెంట్లు కూలదోశారని చెవులు కొరుక్కుంటున్నారన్నారు. ఆఖరికి మహానగర ప్రథమ పౌరురాలుకే ఫైన్ వేసినట్టు లీకులు ఇస్తున్నారని, జనాలేమన్న పిచ్చోల్లలా కనిపిస్తున్నారా అంటూ ప్రశ్నించారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments