Monday, November 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్అడిగేదెవరూ.. అంతా మాఇష్టం

అడిగేదెవరూ.. అంతా మాఇష్టం

గులాబీ నేతల ఇష్టారాజ్యం..
మంత్రి కేటీఆర్ మెప్పు కోసం ఫ్లెక్సీలు..
కొరఢా ఝుళిపించిన బల్దియా
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: అధికారం మాదే.. అడిగేవారు ఎవరు అనుకున్నారో ఏమో వరంగల్ గులాబీ నేతలు. మంత్రి కేటీఆర్ మెప్పు పొందాలని, చూపుతమపై పడాలని ఆయన పర్యటన రూట్ లో జోరుగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగర దారులన్నీ గులాబీమయంగా మార్చారు. అయితే బల్దియా పర్మిషన్ లేకుండా ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేయడంతో.. బల్దియా కొరడ ఝుళిపించింది. స్వయంగా బల్దియా మేయర్ గుండు సుధారాణి ఫ్లెక్సీలకు కార్పొరేషన్ అధికారులు రూ.2 లక్షలు జరిమానా విధించారు. అలాగే టీఆర్ఎస్ రాష్ర్ట నాయకుడు కేశవరావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లకు రూ.50 వేలు ఫైన్ వేశారు. మొత్తంగా పవర్ లో ఉన్న వారిపైనే అధికారులు ఫైన్ వేయడంతో నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments