విద్యుత్ షాక్ తో హోటల్ దగ్ధం
స్పాట్ వాయిస్ చెన్నారావుపేట : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో హోటల్ దగ్ధమైన ఘటన మండలంలోని అమీనాబాద్ లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లాడి వీరారెడ్డికి చెందిన హోటల్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం అయింది. ఈ ఘటనలో సుమారు లక్ష 50 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. విషయం తెలుసుకున్న చెన్నారావుపేట ఎస్సై తోట మహేందర్, నెక్కొండ ఎస్సై సీమా పర్వీన్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది సహకారంతో మంటలను అర్పివేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నాడు.
Recent Comments