బుధరావుపేటలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం
స్పాట్ వాయిస్ ఖానాపూర్ : నర్సంపేట లోని జయముఖి ఫార్మసి కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకంలో భాగంగా మండలంలోని బుధ రావు పేట లో ఏడురోజుల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అశ్విన్ కుమార్ మాట్లాడుతూ ఈ వారం రోజుల కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛభారత్, ప్లాస్టిక్వాడకంపై అవగాహన, పారిశుద్ధ నిర్వహణ మరుగుదొడ్ల వాడకం తదితర అంశాలపై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామస్తులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సేవా కార్యక్రమం నిర్వహించడానికి జయముఖి కళాశాల వారు తమ గ్రామాన్ని ఎంపిక చేసుకునేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు . అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల యాజమాన్యం శంకర్ రెడ్డి మాట్లాడుతూ వాలంటీర్లు క్రమశిక్షణతో మెలగాలని గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుధగాని రమ, ఎంపీటీసీ లింగమ్మ సుభాన్ బి పంచాయతీ సెక్రటరీ రజిత కళాశాల ప్రిన్సిపాల్ వాసుదేవ మూర్తి, అనిల్ కుమార్ అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Recent Comments