అనారోగ్యంతో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మృతి
నివాళి అర్పించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి
స్పాట్ వాయిస్, శాయంపేట:శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నామని విజయ్ కుమార్ అనారోగ్యంతో శనివారం సాయంత్రం చనిపోయాడు. కొద్దీ రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నామని విజయకుమార్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హన్మకొండ రాంనగర్ లోని విజయకుమార్ ఇంటికి వెళ్లి మృతదేహంపై పూలమాల వేసి నివాళి అర్పించారు.
కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే శాయంపేట్ మాజీ వైస్ ఎంపీపీ వంగాల నారాయణ రెడ్డి, ఎర్రబెల్లి ప్రభాకర్ రెడ్డి, కొప్పుల సర్పంచ్ గోలి మాధురి మహేందర్ రెడ్డి,శాయంపేట సర్పంచ్ కందగట్ల రవి, టీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి, టీఆర్ ఎస్ కొప్పుల గ్రామ అధ్యక్షుడు సామల మధుసూదన్, మాజీ సర్పంచులు గుర్రం రవీందర్, తోట కుమారస్వామి, పుట్ట మొండయ్య, కల్లెపు మురళి తదితరులు నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Recent Comments