Thursday, November 28, 2024
Homeతెలంగాణ5 లక్షలిస్తావా..? వీడియో బయటపెట్టాలా..!

5 లక్షలిస్తావా..? వీడియో బయటపెట్టాలా..!

యువతిని బెదిరించి కటకటలాపాలైన యువకుడు
స్పాట్ వాయిస్, కొత్తగూడం: యువతీ యువకుడు ఫ్రెండ్స్. యువతికి ఇటీవలే మ‌రొక‌రితో నిశ్చితార్థం జ‌రిగింది. దీన్ని ఆస‌రాగా చేసుకున్న ఆ యువ‌కుడు.. యువ‌తిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. మనం సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపులు మొదలు పెట్టాడు. వేధింపులు భరించలేక చివరికి యువతి పోలీసులను ఆశ్రయించింది. వివ‌రాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ద‌మ్మపేట మండ‌లం మందాల‌ప‌ల్లికి చెందిన కే అమ‌ర్ ఓ యువ‌తితో ప‌రిచ‌యం ఏర్పర్చుకున్నాడు. అయితే వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో యువ‌తికి తెలియ‌కుండా ఫొటోల‌ను, వీడియోల‌ను చిత్రీక‌రించాడు. ఇటీవ‌లే ఆమెకు మ‌రో యువ‌కుడితో నిశ్చితార్థం జ‌రిగింది. అప్పటి నుంచి అమ‌ర్.. ఆమెను బ్లాక్ మెయిల్ చేయ‌డం ప్రారంభించాడు.
మొద‌ట‌గా స‌న్నిహితంగా ఉన్న ఫొటోల‌ను ఆమెకు కాబోయే భ‌ర్తకు పంపించాడు. రూ. 5 ల‌క్షలు ఇవ్వక‌పోతే ఆ వీడియోల‌ను కూడా వైర‌ల్ చేస్తాన‌ని బెదిరిస్తున్నాడు. చేసేదేమీ లేక బాధిత యువ‌తి.. ద‌మ్మపేట పోలీసుల‌కు అమ‌ర్‌పై ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అమ‌ర్‌తో పాటు అత‌ని స్నేహితులు ధ‌ర్మారావు, అనిల్‌, వెంక‌టేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments