తాడ్ బండ్ లో ప్రారంభించిన ఈటల రాజేందర్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో శోభాయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. శోభాయాత్రలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. గౌలిగుడాలోని శ్రీ సీతారామ ఆంజనేయ స్వాములను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లడుతూ.. ఏటా తాడబండ్ ఆంజనేయస్వామి దేవాలయం వరకు శోభాయాత్ర సాగుతుందని, ఈ ఏడాది తాను శోభాయాత్ర ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. రామాయణ, మహా భారతాలు మనకి మంచి జీవనవిధానం అందిస్తున్నాయని, రామాయణ ఇతిహాసం ఆదర్శ జీవితానికి నిదర్శనమని పేర్కొన్నారు. రోజు రోజుకీ పెరిగిపోతున్న పాశ్చాత్య ధోరణులతో తరగిపోతున్న మనవసంబంధాలు పెంపొందించడానికి రామాయణ ఇతిహాసాలు, మన సంప్రదాయాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 8 వేల మంది పోలీసులు, 550 సీసీ కెమెరాలు, 4 మౌంటెడ్ కెమెరాలు, మఫ్టీ పోలీసులతో నిఘా పెట్టారు. మరోవైపు గౌలిగూడ రామమందిరం నుంచి యాత్ర మొదలై రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద శోభాయాత్ర ముగియనుంది.
ఉత్సాహంగా.. శోభాయాత్ర
RELATED ARTICLES
Recent Comments