పేకాట శిబిరంపై దాడి
11 మంది అరెస్ట్
స్పాట్ వాయిస్ నర్సంపేట : పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి 11 మందిని అరెస్ట్ చేసిన ఘటన నర్సంపేటలో శుక్రవారం రాత్రి జరిగింది. నర్సంపేట సిఐ పులి రమేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మహేశ్వరంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా గ్రామ శివారులోని చెరువు కట్ట పై కొందరు వ్యక్తులు డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నారని సమాచారం అందిందన్నారు. అట్టి సమాచారం మేరకు అక్కడికి వెళ్లగా చూడగా మహేశ్వరం గ్రామానికి చెందిన 11 మంది పేకాట ఆడుతూ పట్టుబడ్డారన్నారు. వారి వద్ద నుండి 3 వేల రూపాయల నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Recent Comments