Friday, September 20, 2024
Homeకెరీర్3,334 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్

3,334 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్

స్పాట్ వాయిస్, హైదరాబాద్: అబ్కారీ, అటవీ, అగ్నిమాపకశాఖల్లో ఖాళీగా ఉన్న 3,334 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చ జెండా ఊపింది. ఈమేరకు బుధవారం సాయంత్రం అబ్కారీ, అటవీ, అగ్నిమాపక శాఖల్లోని ఉద్యోగ నియామకాలకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. తొలి విడతలో 30,453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. నియామక నోటిఫికేషన్లు జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ, పోలీసు నియామక సంస్థ, విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments