కాసులు సమర్పించుకున్న జిల్లా అధికారులు
ఆరా తీస్తున్న పోలీసులు
భూపాలపల్లిలో సైబర్ నేరగాళ్ల మాయ
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఏకంగా కలెక్టర్ల పేర్లతో అధికారులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సైబర్ నేరగాళ్ల మోసానికి పాల్పడ్డారు. జిల్లా కలెక్టర్ పేరుతో జిల్లా అధికారుల నుంచి డబ్బులు లాగేశారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా ఫొటో డీపీతో సదురు కేటుగాళ్లు ఫేక్ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేశారు. మొదట ఉద్యాన శాఖ అధికారి అక్బర్ నుంచి రూ.50 వేలతో అమెజాన్ లో ఈ- పే కార్డులను కొనుగోలు చేశారు. రూ.50 వేలు మాయం అయిన తరువాత అధికారి తేరుకున్నాడు. తమ బాసు నుంచి వచ్చిన మెసేజ్ కాదా అనే భావనతో.. అధికారులంతా ఇదే తరహాలో ఇతర శాఖల అధికారులు సైతం సమర్పించుకున్నట్లు సమాచారం. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని చెప్పే అధికారులే ఇలా బలైపోవడంతో.. ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. బయటికి తెలిస్తే పరువు పోతుందని గమ్మున ఉంటున్నారు. అయితే పోలీసులు దీనిపై కూపీ లాగుతున్నట్లు సమాచారం. వాట్సప్ నంబర్ లొకేషన్ సెర్చ్ ఆధారంగా బీహార్ నుంచి ఈ మోసం జరిగినట్టు గుర్తించారు.
Recent Comments