డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
స్పాట్ వాయిస్ నర్సంపేట: పట్టణంలో మంగళవారం రాత్రి సీఐ పులి రమేశ్ అధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని వాహనదారులకు పోలీసులు జరిమానాలు విధించారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపకూడదని ఈ సందర్భంగా సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై బొజ్జ రవీందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Recent Comments