స్పాట్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. కొంతమంది ముఠాగా ఏర్పడి వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు జరిపి అరెస్ట్ చేశారు. ఎస్పీ శరత్ చంద్రపవార్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ రెడ్డిబజార్ లోని ఇంట్లో ఓ స్వచ్ఛంద సంస్థ ఉద్యోగులతో పాటు మరికొందరు వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తెలియడంతో దాడులు జరిపారు. ఈ సందర్భంగా బానోత్ రవి, బాదావత్ సరోజ, మాలోత్ మంగిలాల్ లోకేష్, భూక్య కెన్కి బాదావత్ రాములు అనే వ్యక్తులు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా వారి నుంచి పది సెల్ ఫోన్లు, నిరోధ్ ప్యాకెట్లు, ఆటో, రెండు ద్విచక్రవాహనాలను పట్టుకున్నట్టు చెప్పారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. దాడుల్లో టాస్క్ ఫోర్సు సీఐ జి మోహన్, మహబూబాబాద్ టౌన్ సీఐ వై సతీష్, టాస్క్ ఫోర్సు ఎస్సైలు కే జగదీష్, టీ రామారావు తోపాటు టాస్క్ ఫోర్సు సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డు అందజేశారు.
Recent Comments