సీఎం కీలక నిర్ణయం..
మీడియా ముందు వెల్లడించిన కేసీఆర్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ర్టంలోని యాసంగి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని నిర్ణయానికి వచ్చారు. కేబినెట్ భేటీలో మంత్రులతో చర్చించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. అనేక అంశాలను వెల్లడించారు. కేంద్రం 24 గంటల డెడ్ లైన్ విధించినా.. స్పందించకపోవడంతో రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనుగోలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే ఆరు కొత్త ప్రైవేటు యూనివర్సిటీలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల హామీల మేరకు 111 జీవోను ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ‘‘మే 20 నుంచి జూన్ 5 వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తామని, చెన్నూరు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఫార్మా యూనివర్సిటీని వెంటనే అందుబాటులోకి తేవాలని, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సెకండ్ రన్‌వే కోసం చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో నియామకాలకు కామన్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
స్పాట్ ఫ్లాష్.. ఇగ మేమే కొంటాం..
RELATED ARTICLES
Recent Comments