జర్నలిస్టు హెల్త్ స్కీంలో కొత్త రూల్..
ఇబ్బంది పడుతున్న జర్నలిస్టుల కుటుంబాలు..
డీపీఆర్వోల వద్దకు పరుగుపెడుతున్న విలేకరులు
స్పాట్ వాయిస్, హన్మకొండ : జర్నలిస్టు హెల్త్ స్కీం (జేహెచ్ ఎస్)లో అధికారులు కీలక మార్పులు చేశారు. ఓటీపీ వస్తేనే రిజిస్ర్టేషన్ చేస్తున్నారు. మందులు సైతం ఓటీపీ ఆధారంగానే ఇస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈ ప్రక్రియ మొదలుకాగా.. ఈ విధానంపై ప్రచారం లేకపోవడంతో.. ఆస్పత్రికి వచ్చిన జర్నలిస్టు కుటుంబ సభ్యులు నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. జర్నలిస్టులు డీపీఆర్ ఓల వద్ద ఫోన్ నంబర్ అప్ డేట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. అయితే కొత్త సాఫ్ట్ వేర్ తో డీపీఆర్ వో ఆఫీసుల్లోనూ అప్ డేట్ అవడం లేదని సమాచారం. దీంతో దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు మందులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉద్యోగులకు సైతం ఇదే విధానాన్ని తీసుకొచ్చినా.. వారికి ఈజీహెచ్ ఎస్ లోనే ఓటీపీని జనరేట్ చేస్తుండడంతో.. వారికి పెద్దగా సమస్యలు ఎదురుకావడం లేదు.
ఓటీపీ వస్తేనే మెడిసిన్
RELATED ARTICLES
Recent Comments