కెనాల్ లో పడిన బోలెరో
12 మంది కూలీలకు గాయాలు
స్పాట్ వాయిస్, రేగొండ : కూలీలతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి కెనాల్ లో బోల్తా పడి 12 మంది కూలీలు గాయపడ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘట్ జిల్లా కరిలీ గ్రామానికి చెందిన వలస కూలీలు జనవరి నెలలో కూలీ పనులు నిమిత్తం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మిర్చి ఏరడానికి వెళ్లారు. అయితే కూలీలకు సంబంధించిన ఓ కుటుంబంలో పెళ్లి ఉండడంతో వారంతా మధ్యప్రదేశ్‌కు తిరుగుపయణం అయ్యారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం రేగొండ మండలం గోరికొత్త గ్రామ పరిధి జంషెడ్పేట్ గ్రామ సమీపంలో మూలమలుపు బ్రిడ్జి వద్ద ప్రమాదవశాత్తు కెనాల్ లో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది కూలీలు గాయపడ్డారు. విషయం తెలుసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని అంబులెన్స్‌లో ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే కెనాల్ కి సమీపంలో రెండు ఈత చెట్లు ఉండడంతో వ్యాన్ వాటిని ఢీకొని మెల్లగా కాలువలో పడిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. కాగా, ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సూచనల మేరకు వాహనంలో ప్రయాణిస్తున్న సుమారు 40 మందికి పీఏసీఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్‌రావు రేగొండలో భోజనాలు పెట్టించారు.
Recent Comments