Sunday, November 24, 2024
Homeజనరల్ న్యూస్సంతానం కావాలి.. భర్తను పంపించండి..

సంతానం కావాలి.. భర్తను పంపించండి..

మహిళా అభ్యర్థనను మన్నించిన హైకోర్టు
జీవిత ఖైదు అయిన భర్తకు 15 రోజుల పెరోల్
స్పాట్ వాయిస్, డెస్క్: రాజస్థాన్ హైకోర్టు ఓ కేసులో ఆసక్తికరమైన తీర్పు వెలువరించింది. భార్యతో కలిసి బిడ్డను కనేందుకు జీవితఖైదు అయిన భర్తకు 15 రోజుల పెరోల్ మంజూరు చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రాజస్థాన్‌కు చెందిన లాల్ అనే వ్యక్తి ఓ కేసులో జీవితఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. తనకు 15 రోజుల పాటు పెరోల్ మంజూరు చేయాలని, భార్యను కలిసి వస్తానని అజ్మీరు జిల్లా కమిటీకి లాల్ పిటిషన్ సమర్పించుకున్నారు. కానీ, జిల్లా కమిటీ జీవిత ఖైదు పడిన లాల్ కు పెరోల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో లాల్ భార్య రంగంలోకి దిగింది. తన భర్తకు 15 రోజుల పాటు పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె ఏకంగా రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు వివాహమైనా ఇప్పటి వరకు పిల్లలు లేరని, వైవాహిక జీవితంలో లైంగిక, భావోద్వేగ అవసరాలు తీరడంతోపాటు.. తనకు బిడ్డ పుట్టడం కోసం భర్తకు 15 రోజుల పెరోల్ ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వివాహమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంటకు ఎలాంటి సమస్య లేదని, వంశ రక్షణ కోసం సంతానం కలిగి ఉండటం మతతత్వాలు, భారతీయ సంస్కృతి, వివిధ న్యాయపరమైన అంశాల ద్వారా గుర్తించబడిందని పేర్కొంటూ కోర్టు జీవిత ఖైదు అయిన భర్తకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. దీంతో లాల్ కు రూ.25వేల చొప్పున రెండు పూచీకత్తులతోపాటు రూ.50వేల వ్యక్తిగత బాండ్ ను అందించి పక్షం రోజుల పాటు పెరోల్ పై విడుదల చేయాలని హైకోర్టు యంత్రాంగాన్ని ఆదేశించింది. కాగా, ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక విషయాలు వెల్లడించింది. ఖైదీ భార్య ఎలాంటి నేరం చేయలేదని, అందుకే ఆమె ఎలాంటి శిక్షకు గురి కావద్దని పేర్కొంది. ఆమెకు మాతృత్వం పొందే హక్కు లేకుండా చేయడం సరికాదని, ముఖ్యంగా ఖైదీల భార్యలు సంతానం కోసం భర్తతో వైవాహిక సంబంధాన్ని కొనసాగించడానికి నిరాకరించడం వారి హక్కులను ప్రతికూలంగా ప్రభావితం చేయడమే అవుతుందని కోర్టు అభిప్రాయపడింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments