Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలుతూర్పులో ఘనంగా శ్రీరామ నవమి

తూర్పులో ఘనంగా శ్రీరామ నవమి

ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
స్పాట్ వాయిస్, వరంగల్ : శ్రీరామ నవమి సందర్భంగా వరంగల్ నగరంలోని వివిధ ఆలయాల్లో ఆదివారం నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణ క్రతువును వీక్షించారు. ఆటోనగర్ లో శ్రీ శృంగేరి శంకర మఠంలో జరిగిన శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని హాజరయ్యారు. ఆయన వెంట 23 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ, ఇతర నాయకులు ఉన్నారు.
* వరంగల్ శాంతి నగర్‌లోని ఆర్య వైష్ణవి వాసవి మాత పరపతి సంఘం భవనంలో శ్రీరామనవమి వేడుకలకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.
* ఎస్.ఆర్.ఆర్ తోటలోని వీరాంజనేయ సాయిబాబా ఆలయంలో జరిగిన శ్రీ రామనవమి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. ఆయన వెంట కార్పొరేటర్లు ముష్కమల్ల అరుణ సుధాకర్, పల్లం పద్మ రవి, పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్,ముఖ్య నాయకులు ఉన్నారు.
* కరీమాబాద్ బొమ్మలగుడిలో జరిగిన శ్రీరామనవమి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కార్పొరేటర్ సిద్దం రాజు,ఆలయ చైర్మన్,ధర్మకర్తలు హాజరయ్యారు.
* రంగశాయిపేటలో జరిగిన నవమి వేడుకలకు ఎమ్మెల్యే నన్నపునేని, కార్పొరేటర్,పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, మాజీ కార్పోరేటర్ కేడల పద్మ తరలివచ్చి పూజలు చేశారు.
*కాశీబుగ్గ లో భక్తమార్కండేయ స్వామి దేవాలయం, ఓసిటీలోని సీతారామాంజనేయ స్వామి దేవాలయం, ఆర్యవైశ్య సంఘంలో జరిగిన శ్రీ రామనవమి వేడుకలకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరుకాగా.. ఆయన వెంట కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, ఓని స్వర్ణలత భాస్కర్, మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి ఉన్నారు.
* వరంగల్ దేశాయిపేట వీవర్స్ కాలనీలో హనుమాన్ దేవాలయంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకలకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కార్పొరేటర్ సురేష్ జోషి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సాంబారి సమ్మారావు హాజరయ్యారు.
* దేశాయిపేట లక్ష్మి మెగా టౌన్ షిప్ లోని సాయిబాబా ఆలయంలో, రాజ్ నాథ్ పూరి కాలనీలో, డాక్టర్స్ కాలని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకలకు ఎమ్మె్ల్యే హాజరయ్యారు. ఆయన వెంట కార్పొరేటర్లు కావటి కవిత రాజు యాదవ్,సురేష్ జోషి ఉన్నారు.
* శివనగర్ రామాలయంలో శ్రీ రామ నవమి వేడుకలకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments