Monday, April 7, 2025
Homeతెలంగాణకమనీయం.. భద్రాద్రి రాముడి కల్యాణం..

కమనీయం.. భద్రాద్రి రాముడి కల్యాణం..

చిత్రమాలిక మీకోసం..
స్పాట్ వాయిస్, భద్రాచలం: భద్రాద్రిలో సీతారాముల కల్యాణ మహోత్సం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలో భక్తజనసందోహం నడుమ కల్యాణ క్రతువు సాగింది. స్వామి వారి కల్యాణానికి ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌, సత్యవతి రాథోడ్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇక, టీటీడీ తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అందజేశారు. ఈ ఏడాది శ్రీసీతారాముల కల్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి కల్యాణాన్ని వీక్షించేందుకు రెండేళ్ల తర్వాత భక్తులకు అనుమతి ఇచ్చారు. కరోనా వల్ల గత రెండేళ్లు భక్తులను అధికారులు అనుమతించలేదు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments