Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలునల్లబెల్లిలో సీతారాముల కళ్యాణం

నల్లబెల్లిలో సీతారాముల కళ్యాణం

అంగరంగ వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణం

స్పాట్ వాయిస్ నల్లబెల్లి: మండల కేంద్రంలోని కొండ జీడికంటి రామయ్య నగర్ రామాపురంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించారు.  భక్తుల జయ జయ కీర్తనల మధ్య  కన్నుల పండుగగా జరిగింది. వేకువజామునే ధ్వజారోహణ కార్యక్రమం, స్వామివారి మేలుకొలుపు సేవ పక్షాన కార్యక్రమం అనంతరం మండల కేంద్రంలోని పురవీధులలో ఉత్సవ విగ్రహాల శోభాయాత్ర జరిగింది. అనంతరం దేవతామూర్తుల కల్యాణోత్సవ కార్యక్రమం దేవాలయ వ్యవస్థాపక రాజ పోషకులు కొండా లక్ష్మణ్ స్వామి, కొండ భాస్కర స్వామి, కొండ కృష్ణ స్వామి ,కొండ గోపి కృష్ణ దంపతుల ఆధ్వర్యంలో పురోహితులు శ్రీధర్ స్వామి. కల్యాణోత్సవాన్ని అంగరంగవైభవంగా జరిపించారు. ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడంతో పాటు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాతలు. మండల కేంద్రానికి చెందిన బత్తిని మహేష్. మాచర్ల రమేష్. పాండవుల రాంబాబు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నాగవెల్లి శ్రీనివాస్. పాండవుల శంకర్లింగం. పప్పు మొగిలి తదితరులు చేపట్టగా. ఈ కార్యక్రమంలో బత్తిని.మల్లయ్య. గోనెల నరహరి. కొత్తపెళ్లి రామ నరసయ్య. శ్రీనివాసా లక్ష్మీనారాయణ. ఉప సర్పంచ్ లత నాగేశ్వరరావు. ఉడత వీరన్న భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments