Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలురామ నామంతో మార్మోగిన ఆలయం

రామ నామంతో మార్మోగిన ఆలయం

రామ నామంతో మార్మోగిన ఆలయం

స్పాట్ వాయిస్, హన్మకొండ టౌన్: నగరంలో ని స్నేహనగర్ కాలనీలో ని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణం వేడుకగా సాగింది. కాలనీ వాసులంతా తరలిరాగా.. వేదమంత్రోచ్ఛరణల నడుమ కళ్యాణ క్రతువు సాగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రావు, కాలనీ ప్రెసిడెంట్ చిన్న, చైర్మన్ బీ.శశికాంత్ రెడ్డి, జీ వాసుదేవ్, బాలరాజు, వెంకటనర్సింహరావు, నా‌రాయణ రెడ్డి, రాంబ్రహ్మం, చలపతి రావు, తిరుపతి రెడ్డి, బాపురెడ్డి, ధర్మకర్తల మండలి, కాలనీ వాసులు పాల్గొన్నారు. స్వామివారి కల్యానంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments