వైభవంగా సీతారాముల కల్యాణం
-బుద్ధారంలో పట్టు వస్త్రాలు సమర్పించిన గండ్ర సత్యనారాయణరావు
స్పాట్ వాయిస్, గణపురం: మండల వ్యాప్తంగా సీతారాముల కల్యాణోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ల ఆధ్వర్యంలో ఆలయాల్లో కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి రామస్వామి దేవాలయంలో అర్చకులు గోవర్ధన దుర్వాసాచార్యులు, వేణుగోపాలాచార్యులు, శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో కనుల పండువగా సీతారాముల కళ్యాణం జరిగింది. ఈ వేడుకల్లో బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ చార్జీ, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బుద్ధారం గ్రామంలో శ్రీరామలింగేశ్వరాలయంలో గండ్ర సత్యనారాయణరావు – పద్మ దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. చెల్పూర్ కేటీపీపీలోని రామలింగేశ్వరాలయంలో సీఈ సిద్దయ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెల్పూర్ సీతారామాంజనేయ స్వామి దేవాలయం, మైలారం, గాంధీనగర్, బస్వరాజుపల్లి, కొండాపూర్, ధర్మారావుపేట, నగరంపల్లిలోని ఆలయాల్లో ఆయా గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టాభి రామస్వామి దేవాలయం ధర్మకర్తలు, చైర్మన్ జంగిలి శ్రీనివాసరావు, సర్పంచులు నారగాని దేవేందర్, నడిపెల్లి మధుసూదన్ రావు, ఆలూరి కుమారస్వామి, పోతుల ఆగమ్మ, ఆగంరావు, చెరుకు కుమారస్వామి నల్లాని అరుణ, వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, ఎంపీటీసీలు మోటుపతులు శివశంకర్ గౌడ్, పొనగంటి సుధర్మ మల్హర్ రావు, చెన్నూరి రమాదేవి మధుకర్, కొత్త పద్మ వెంకటేశ్వర్లు, బైరగాని తిరుపతి, అయిత రమేశ్, తాళ్ళపెళ్లి గోవర్తన్, రేపాక రాజేందర్, భక్తులు పాల్గొన్నారు.
Recent Comments