నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏవి?
రైతులతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి
వైఎస్సార్ టీపీని బలోపేతం చేయాలి
భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్: రాష్ర్టంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, దేశానికి వెన్నుముక లాంటి రైతులతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీ కళాశాలలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు ప్రజల వైపు నిలబడి జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కష్టపడి పని చేయాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని, గ్రామ,మండల స్థాయిలో కమిటీలు పూర్తి చేయాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు ప్రజలను అయోమయంలోకి నెట్టేశాయని పేర్కొన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రైతులను రాజుగా చేసి రుణమాఫీ , ఉచిత విద్యుత్ ,ఫీజు రీయింబర్స్ మెట్, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతు ఆత్మహత్యలపై అధికార పార్టీ ఇప్పటివరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో చనిపోయిన రైతు, నిరుద్యోగ కుటుంబాలను కలిసి పరామర్శించి కొంత ఆర్థిక సాయం చేసేందుకు వైయస్సార్ తెలంగాణ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పార్టీ అధినేత్రి షర్మిల పాదయాత్ర రూట్ మ్యాప్ ను రాష్ట్ర పార్టీకి పంపించడం జరిగిందని, త్వరలోనే జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రామకృష్ణ, రమేష్, పర్వతాలు, శంకర్, కృష్ణ, యశ్వంత్, వీరబాబు, గణేష్, దేవేందర్, మనోహర్ రావు రవికుమార్, శ్రీనివాస్, సతీష్, ప్రశాంత్, కళ్యాణ్ ,రాకేష్, హరి ,వినయ్ కుమార్, ప్రదీప్, నవీన్, శ్రీకాంత్ ,వంశీ తదితరులు పాల్గొన్నారు.
హామీల అమల్లో ప్రభుత్వాలు విఫలం
RELATED ARTICLES
Recent Comments