స్పాట్ వాయిస్, డెస్క్: దేనిని వదలేది లేదా..? ఏదైనా మంచిదేనా.. అసలేం జరుగుతోంది.. ఎటుపోతోందీ సమాజం. కామంతో కళ్లు మూసుకుపోతాయని తెలుసుగానీ, మరీ ఇంతనా అని ఎవరూ అనుకోరు. వికృత చేష్టల కామాంధులు మనీషి తాలూకు విలువను మృగ్యం చేస్తూ, ప్రకృతిని పరిహసిస్తున్నాడా..? అవసరం తీరడానికి ఏదైతేనేమి అని రెచ్చిపోతున్నాడా..? అంటే మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన చూస్తే అవుననే అనిపిస్తుంది. కామంతో రెచ్చిపోయిన ఓ ప్రబుద్ధుడు ఏకంగా ఉడుముపైనే అత్యాచారం చేశాడు. మహారాష్ట్ర కొల్హాపూర్లో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. సహ్యాద్రి టైగర్ ప్రాజెక్ట్ పరిధిలో పులులను లెక్కించేందుకు అధికారులు కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే, కొందరు వ్యక్తులు వేట తుపాకులతో సంచరిస్తున్నట్లు కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. వారి మొబైల్ ఫోన్లు తీసుకుని పరిశీలిస్తుండగా.. ఉడుముపై అత్యాచారం చేసినట్లు బయటపడింది. కేసు నమోదు చేసిన అధికారులు.. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాగా నిందితుడిని మానసిక వైద్యుడి వద్దకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Recent Comments