స్పాట్ వాయిస్,క్రైం: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. జనగామ జిల్లాకు చెందిన 10 మంది వ్యక్తుల నుంచి సుమారు 3 లక్షల రూపాయలతో పాటు కంప్యూటర్లు, లాప్టాప్, లు సెల్ఫోన్లు స్వాధీనం చేశారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లాల కురుమవాడకు చెందిన ముగ్గురితో పాటు స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్ గ్రామాలకు చెందిన 10 యువకులు క్రెకిట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దీనిపై ఐపీఎల్ సీజన్లో సాగే బెట్టింగ్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. బెట్టింగ్ రాయుళ్లను పట్టుకునేందుకు పక్కా పణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలో గతంలో బెట్టింగ్ నిర్వహించిన వారి వివరాలను సేకరించి వారిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. కాగా, యువత, విద్యార్థులు బుకీల మాయలో పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు
Recent Comments