Thursday, November 14, 2024
Homeజాతీయంఅలర్ట్... కరోనా కొత్త వేరియంట్.. ఆగయా

అలర్ట్… కరోనా కొత్త వేరియంట్.. ఆగయా

కరోనా కొత్త వేరియంట్..
ఒమిక్రాన్ కంటే 10 శాతం స్పీడ్
స్పాట్ వాయిస్, డెస్క్: భారత్ లో సరికొత్త కరోనా వేరియంట్ వెలుగు చూసింది. ఒమిక్రాన్ రకం కన్నా 10శాతం వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఒమిక్రాన్​ ఎక్స్​ఈ’ రకం కరోనా వైరస్​ను ముంబైలో గుర్తించినట్లు బృహన్​ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. మొత్తం 376 సాంపిల్స్​కు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా.. ఒకరిలో ఎక్స్​ఈ, మరొకరిలో కప్పా వేరియంట్ ను​ గుర్తించినట్లు వివరించారు. ఈ కొత్త వేరియంట్లు సోకిన రోగుల పరిస్థితి విషమంగా లేదని స్పష్టం చేశారు. ముంబయిలో పరీక్షించిన 230 సాంపిల్స్​లో.. 228 కేసులు ఒమిక్రాన్​గా తేలిందని ఆ అధికారి చెప్పారు.
* రెండు వేరియంట్ల మిక్సింగ్
దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 రకాల కలయికతో ‘ఒమిక్రాన్​ ఎక్స్​ఈ’ వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బీఏ.2 రకంతో పోల్చితే ఒమిక్రాన్​ ఎక్స్​ఈ వేరియంట్​ 9.8శాతం అధికంగా వ్యాప్తి చెందే అవకాశముందని అంచనా వేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇటీవల ఇదే విషయాన్ని వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments