నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి
విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే టీఎస్ ఈఈయూ- 327
– ఐఎన్టీయూసీ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్
స్పాట్ వాయిస్, గణపురం: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే పనిలో పడడం తగదని తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ – 327 (ఐఎన్టీయూసీ) రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. బుధవారం కేటీపీపీ రీజినల్ కమిటీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంజూనగర్ లో జెన్కో కంపెనీ రాష్ట్ర అధ్యక్షుడు పిన్నింటి మాధవరావు అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ మాట్లాడారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించడం వల్ల రైతులు, సంస్థ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. రాష్ట్రంలో 327 యూనియన్ బలంగా ఉందన్నారు. తమ యూనియన్ ద్వారా జెన్కో, ఓ అండ్ ఎంలో పనిచేస్తున్న కార్మికులకు డౌన్ గ్రేడ్ పోస్టులను అప్ గ్రేడ్ చేసి ప్రమోషన్లు ఇప్పించడంతో పాటు కారుణ్య నియామకాలు, ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి అన్ని సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామన్నారు. రాబోయే పే రివిజన్ లో కార్మికులకు మెరుగైన పీ ఆర్సీ అందించేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం టీఎస్ ఈఈయూ- 327 (ఐఎన్టీయూసీ) జెన్కో కంపెనీ రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా ఎంపికైన పిన్నింటి మాధవరావు, ప్రధాన కార్యదర్శి మజీద్, వర్కింగ్ ప్రెసిడెంట్ సదానందం, జాయింట్ సెక్రెటరీ ఉమాదేవి, రాష్ట్ర కోశాధికారి దామోదరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రారెడ్డి, శ్రీను, కుమార్, కవితలను కేటీపీపీ రీజినల్ కమిటీ కార్మికులు ఘనంగా సన్మానించారు. అనంతరం కేటీపీపీలో పనిచేస్తున్న వివిధ సంఘాల చెందిన ఓ అండ్ ఎం ఆర్టిజన్ కార్మికులు టీఎస్ ఈఈయూ- 327లోకి చేరిన సందర్భంగా వారికి కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ గౌడ్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కట్ల సదయ్య, రీజినల్ సెక్రటరీ సముద్రాల రాజు, ట్రెజరర్ అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కుల రమేష్, నాయకులు ఓరుగంటి కిరణ్ రావు, కల్పన, జలపతి, వేణు, తిరుపతి, సుధాకర్, మధుసూదన్ రావు, రాజయ్య, కృష్ణ, లక్ష్మణ్, భూమయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments