ఎర్రబంగారం ధర పైపైకి..
దేశీ రకం మిర్చికి 55 వేలు..
రికార్డులు సృష్టిస్తున్న ధరలు
12 వేలు దాటిన పత్తి ధర
స్పాట్ వాయిస్, కాశీబుగ్గ: మిర్చి, పత్తి ధరలు ఈ ఏడాది రికార్డులు సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి ధర రోజు రోజుకీ పసిడిను మించిపోతోంది. వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో కొద్ది రోజులక్రితం రూ. 52 వేలు పలికిన దేశీ రకం మిర్చి సోమవారం రూ.55 వేలు పలికింది. మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధర అని సంబంధిత అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గోవిందపురం గ్రామానికి చెందిన రైతు పేరాల కిషన్ రావు కు చెందిన 30 బస్తాల మిర్చి ని ఏనుమాముల మార్కెట్‌కు తీసుకురాగా, శాంభవి ట్రేడర్స్ ఖరీదుదారులు క్వింటాల్‌కు రూ.55,571 చొప్పున కొనుగోలు చేశారు. అలాగే పత్తి ధర క్వింటాల్ రూ.12,110 పలికింది. ఇది కూడా ఆల్ టైమ్ రికార్డు అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన రైతు కట్టయ్య తీసుకువచ్చిన ఆరు బస్తాల పత్తికి గణపతి సాయి ట్రేడర్స్ ఖరీదుదారులు క్వింటాల్ ధర రూ.12,110 చొప్పున కొనుగోలు చేశారు.
దేశ మిర్చికి రూ. 55 వేలు
RELATED ARTICLES
Recent Comments