Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్వాట్సప్‌ మెసేజ్ ఫార్వర్డ్.. ఒక్కసారే.. ఒక్కరికే

వాట్సప్‌ మెసేజ్ ఫార్వర్డ్.. ఒక్కసారే.. ఒక్కరికే

గతంలో ఐదుగురికి ఆప్షన్..
సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చిన వాట్సప్
స్పాట్ వాయిస్, డెస్క్: వాట్సాప్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకుస్తోంది. స్పామ్, ఫేక్ సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు ఈ ఫీచర్‌ను డెవలప్ చేసింది. వాట్సాప్​లో ఇప్పటి వరకు ఒక సందేశాన్ని ఐదుగురికి ఒకేసారి ఫార్వర్డ్​ చేయొచ్చు. వాటికి ‘ఫార్వర్డెడ్’ అని కనిపిస్తుంది. అయితే.. స్పామ్‌ను తగ్గించే ఉద్దేశంతో తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్​తో మెసేజ్‌లను ఇతర గ్రూపుల్లో, వ్యక్తిగత చాట్​లకు పంపడంపై పరిమితులు విధించింది. ‘ఫార్వర్డెడ్​ మెనీ టైమ్స్’​ ట్యాగ్​తో కేవలం ఒకసారి ఒకే గ్రూప్​ లేదా ఒక వ్యక్తికి షేర్​ చేయొచ్చు. గత నెలలో అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్​ బీటా వర్షన్ ఆడ్రాయిడ్​ 2.22.7.2 అప్డేట్​లో ఈ ఫీచర్ వచ్చింది. దీనిపై వినియోగదారుల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ.. కొత్త ఫీచర్​ను తీసుకురావడాన్ని సమర్థించుకుంది. ఇక ఎవరైన ఫార్వర్డ్​ సందేశాన్ని రెండు లేదా అంతకన్నా ఎక్కువ గ్రూపులకు పంపాలని ప్రయత్నిస్తే ఎర్రర్​ మెసేజ్​ వస్తుంది. ఫార్వర్డెడ్​ మెసేజ్​లు కేవలం ఒకసారి ఒకే గ్రూప్​లోకి పంపించవచ్చు అనే పాపప్​ మెనూ కనిపిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments