గుట్కా,అంబర్ ప్యాకెట్లు తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
స్పాట్ వాయిస్ నర్సంపేట : ప్రభుత్వం నిషేధించిన గుట్కా, అంబర్ ప్యాకెట్లు తరలిస్తున్న ఇద్దరిని నర్సంపేట పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. నర్సంపేట సీఐ పులి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం .. స్థానిక పోలీసులు ఆదివారం నర్సంపేటలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నరావుపేట మండలం సూర్యాపేట తండాకు చెందిన ధరావత్ వెంకటేశ్వర్లు, ధరావత్ హనుమ ద్విచక్రవాహనంపై రెండు బ్యాగులతో వెళ్తు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని పట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న బ్యాగులలో ప్రభుత్వం నిషేధించిన సుమారు రూ.25,700 విలువ గల గుట్కా, అంబర్ ప్యాకెట్లు లభించాయి. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, ఉన్నట్లు సీఐ తెలిపారు.
Recent Comments