భూపాలపల్లి జిల్లాలో దారుణం
వంద పడకల ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: భూపాలపల్లి లో దారుణం చోటుచేసుకుంది. పండుగ పూట పురిటినొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణికి డాక్టర్లు పురుడు పోయలేదు. పలిమేల మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన లక్ష్మి పురుడు కోసం జిల్లా కేంద్రంలో ని వందపడకల ఆస్పత్రికి వచ్చింది. ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేరని వరంగల్ మిషన్ ఆస్పత్రికి వెళ్లాలని చెప్పారు. దీంతో 108లో హన్మకొండ కు వెళ్తుండగా.. మార్గ మధ్యలో చెల్పూర్ సమీపంలో ప్రసవించింది. పండింటి బాబుకి జన్మనిచ్చింది. అయితే ఆమెకు తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో మళ్లీ వంద పడకల ఆస్పత్రికి తీసుకెళ్లారు. మళ్ళీ వైద్యులు అడ్మిట్ చేసుకోవాలని కోరగా.. నిరాకరించారు. దీంతో హుటాహుటిన మిషన్ ఆస్పత్రికి తరలించారు. గతంలో నూ ఇలాగే వైద్యులు నిర్వాకంతో.. 108లో మహిళ ప్రసవించింది. పైలెట్ ప్రవీణ్, ఈఎంటి శ్రీకాంత్ కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వంద పడకల ఆస్పత్రి, పెద్ద దవాఖాన అని చెప్పే వైద్యులు కనీసం పురుడు పోయకపోవడంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Recent Comments