షడ్రుచుల సమ్మేళనం ఉగాది
స్పాట్ వాయిస్, కల్చరల్: తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి తెలుపుతుంది.
వేప పువ్వే ప్రధానం.. : ఉగాది పచ్చడిలో వేపపువ్వు పాత్ర కీలకం. ఈ కాలంలో శరీరంలో పెరిగే కఫ దోషాన్ని వేప పువ్వు తగ్గిస్తుంది. మలినాల్ని పోగొట్టి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీనివల్ల కడుపులో పురుగులు నశిస్తాయి.
1) తీపి: మానసిక ఉల్లాసానికి అతి ముఖ్యమైంది. తీపి శరీరంలోని కణాలు నశించిపోకుండా, కొత్త కణాల పెరుగుదలకు.. వాతం, పిత్తం పెరగనివ్వకుండా అదుపులో ఉంచుతుంది.
2. పులుపు..: ఈ రుచి ఆహారం జీర్ణం కావడానికి, మలబద్ధకం లేకుండా ఉండడానికి, మానసిక ఉల్లాసానికి ఉపయోగపడుతుంది. దీన్ని తక్కువగా తీసుకోవాలి. ఈ రుచిని ఆహారంలో చేర్చుకోకపోతే జీర్ణశక్తి దెబ్బతింటుంది. అలాగే ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి.
3. ఉప్పు..: శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలను ఉప్పు అందిస్తుంది. ఆకలి, జీర్ణశక్తిని పెంచుతుంది. అయితే దీన్ని కొద్ది పరిమాణంలోనే తీసుకోవాలి.
4. కారం..: ఉత్తేజాన్నిచ్చి, శరీరంలో వేడిని పుట్టిస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. దీనివల్ల చెమట ఎక్కువగా పడుతుంది. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అయితే దీన్ని కూడా కొద్ది పరిమాణంలోనే తీసుకోవాలి.
5. చేదు..: దీన్ని కొద్దిగానే తీసుకోవాలి. ఇది రక్తాన్ని శుద్ది చేస్తుంది.
6. వగరు..:వగరు కూడా ఆహారంలో మితంగా ఉండేలా చూసుకోవాలి. రక్తస్రావం కాకుండా.., చెమట పట్టకుండా ఉంటుంది.
Recent Comments