లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
క్షటాక్షపూర్ లో పర్యటించి ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే చల్లా
మంగళహారతులతో స్వాగతించిన మహిళలు
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను శుక్రవారం పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ.. ఈ నెల 6వ తేదీన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను డ్రా పద్ధతిలో ఎంపిక చేసి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు వీధి దీపాలు, 60 ఇండ్లకు మీటర్లు బిగించాలని సూచించారు. లబ్ధిదారులను డ్రా పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెం ఎంపీపీ మార్క సుమలత రజనీకర్, జెడ్పీటీసీ రాజు- రాధిక, మండల అధ్యక్షుడు సంజీవ రెడ్డి, సర్పంచ్ యాదగిరి, నాయకులు బుచ్చిరెడ్డి, సుమన్, రమేష్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
మంగళహారతులతో స్వాగతం..
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గ్రామానికి రాగా.. మహిళలంతా ఎదురేగి.. మంగళహారతులతో స్వాగతం పలికారు. తిలకం దిద్ది.. నిండు మనసుతో ఆశీర్వదించారు.
Recent Comments