Friday, November 22, 2024
Homeజాతీయం8మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష

8మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష

స్పాట్ వాయిస్, డెస్క్: కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు ఏపీ హైకోర్టు జైలుశిక్ష విధించింది. రెండు వారాల జైలుశిక్షతో పాటు జరిమానాను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే 8 ఐఏఎస్ అధికారులు హైకోర్టును క్షమాపణలు కోరారు. దీంతో సామాజిక సేవకు అంగీకరిస్తే క్షమాపణలను అంగీకరిస్తామని పేర్కొంది. సామాజిక సేవ చేసేందుకు 8 మంది ఐఏఎస్‌లు సిద్ధపడినట్లు వెల్లడించడంతో జైలుశిక్ష విధింపు తీర్పును సవరించినట్లు హైకోర్టు పేర్కొంది. ఉన్నత న్యాయస్థానం శిక్షను తప్పించింది. ఏడాది పాటు సంక్షేమ హాస్టళ్లలో నెలలో ఒక రోజు సేవ చేయాలంటూ తీర్పునిచ్చింది. అలాగే ఒక రోజు కోర్టు ఖర్చులను భరించాలని ఆదేశాలిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ , రాజశేఖర్ , చినవీరభద్రుడు, జె.శ్యామలరావుతో పాటు మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులున్నారు.
కేసు ఇలా..
ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ, వార్డు సచివాలయాలను తొలగించాలని 2020లో ఇచ్చిన ఉత్తర్వులను ఏడాదిపాటు అధికారులు పట్టించుకోకపోవడంతో సుమోటాగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ఉద్దేశపూర్వకంగా అధికారులు కోర్టు ఉత్తర్వుల అమల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో 8 మంది ఐఏఎస్‌లకు రెండు వారాలు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments