స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వన్‌టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. కొత్త అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని… ఇప్పటికే నమోదు చేసుకున్న వారు ఓటీఆర్ సవరించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త జిల్లా, జోన్లు, ఒకటి నుంచి ఏడో తరగతి వరకు వివరాలను తప్పనిసరిగా నమోదు చేసంకోవాలి. త్వరలోనే నోటిఫికేషన్లు రానున్నందున… నిరుద్యోగులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఓటీఆర్‌తో సిద్ధంగా ఉండాలని కమిషన్ తెలిపింది.
ఓటీఆర్ కీలకం..
ఓటీఆర్ కీలకమని.. వాటిలోని వివరాలే దరఖాస్తులో ఉంటాయని పేర్కొంది. ఓటీఆర్ వల్ల కొన్ని నిమిషాల్లోనే దరఖాస్తుల ప్రక్రియ పూర్తవుతుంది.
రిజిస్ట్రేషన్లు ఇలా...
*టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో ‘న్యూ రిజిస్ట్రేషన్’పై క్లిక్ చేయాలి.
* మొబైల్ నంబరు ఎంటర్చేయాలి.
* ఆ నంబరుకు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేయాలి.
* దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత సమాచారం, అడ్రస్, ఈ-మెయిల్ ఐడీ, 1-7వ తరగతి వరకు 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు, విద్యార్హతలు నమోదుచేయాలి.
* అభ్యర్థి ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. ఈ వివరాలన్నీ సబ్మిట్ చేసిన అనంతరం టీఎస్పీఎస్సీ ఐడీ వస్తుంది. దీంతో పాటు జనరేట్ అయ్యే పీడీఎఫ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* ఒకవేళ సబ్మిట్ కాకపోతే ముందుగానే ‘లాగ్‌అవుట్’ అయితే మళ్లీ మొదటి నుంచి చేయాలి.
ఎడిట్ ఇలా...
* వెబ్‌సైట్‌లో ఎడిట్ ఓటీఆర్‌పై క్లిక్ చేయాలి.
* టీఎస్పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదు చేస్తే.. ఫోన్ నంబరుకు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేయాలి.
* ఎడిట్ చేయాల్సిన వివరాలు సవరించడంతో పాటు 1-7వ తరగతి వరకు 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు, విద్యార్హతలు ఇవ్వాలి.
* అభ్యర్థి ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
* ఈ వివరాలన్నీ నమోదు చేసి ఓకే చేస్తే.. కొత్త ఓటీఆర్ పీడీఎఫ్ కాపీ జనరేట్ అవుతుంది.
Recent Comments