ట్రాఫిక్ చలానాల రాయితీ గడువు పెంపు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువును మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాత నిబంధనల ప్రకారం మార్చి 1 నుంచి 31 వ తేదీ వరకక రాయితీ వర్తిస్తుంది. అయితే.. ప్రజల్లో వస్తున్న స్పందనను చూసి, ప్రజలకు మరింత సౌలభ్యాన్ని కల్పించడం కోసం ఈ రాయితీ గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు.
2.40కోట్లు చలాన్లు క్లీయర్..
రాయితీ ఆఫర్ తో రాష్ట్ర వ్యాప్తంగా 2.40 కోట్ల చలాన్లు చెల్లింపు జరిగిందని హోమంత్రి తెలిపారు. వీటి విలువ రూ. 840 కోట్ల ఆయన వెల్లడించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు చెల్లించి పెండింగ్ చలానా క్లియర్ చేసినట్లు చెప్పారు.
Recent Comments