స్పాట్ వాయిస్, టేకుమట్ల: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. టేకుమట్ల మండలంలోని రామకృష్ణపూర్ (టీ) గ్రామానికి చెందిన వ్యక్తి ఊరి చివరి పంట పొలాలల్లో అనుమానస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామకృష్ణపూర్(టీ) గ్రామానికి చెందిన తిప్పనవేని నర్సయ్య (45) పెద్ద కూతురు అదే గ్రామానికి చెందిన మండల అభిలాషతో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. దీంతో కూతురును మందలించాడు. దీంతో ఆమె ఈ నెల 28న పురుగుల మందు తాగగా, చిట్యాల సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన నర్సయ్య 29న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో 30న ఊరి చివరి పంటపోలాల్లో మృతి చెంది ఉండగా.. స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చిట్యాల సీఐ పులి వెంకట్ గౌడ్, టేకుమట్ల ఎస్సై తమషారెడ్డి సంఘనస్థలం వద్దకు వెళ్లి, వివరాలు సేకరించారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం కోసం చిట్యాల ఆసుపత్రికి తరలించారు. కాగా తన అన్న మృతికి మండల అభిలాష్, రవి, పవన్ పై అనుమానం ఉందని మృతుడి అక్క ఎలవేని సమ్మక్క ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఎస్సై తెలిపారు.
Recent Comments