ఉమ్మడి వరంగల్ నుంచి కీలకంగా ఎదిగిన నేతలు
ఓరుగల్లు నుంచి పదుల సంఖ్యలో అత్యున్నత స్థానానికి ..
ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా టీడీపీ నుంచే..
నలభయ్యేల చరిత్ర సందర్భంగా ప్రత్యేక కథనం..
స్పాట్ వాయిస్, కల్చరల్: ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అప్పటి యువతరం నాయకులంతా టీడీపీలోనే తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఏదో చేయాలనే తపన, రాజకీయంగా మార్పు తీసుకురావాలనే జిజ్™స ఉన్న వారంతా ప్రత్యామ్నంగా కనిపించిన టీడీపీలోనే చేరారు. కొత్త ఒరవడిలో సాగుతున్న పాలనను తమదిగా, అన్న ఎన్టీయార్ ను సొంతమనిషిగా భావించి పార్టీలో చేరి ప్రజాసేవ చేస్తూ రాజకీయంగా ఎదిగారు.
అతిరథ మహారథులంతా..
తెలుగుదేశం పార్టీకి ఓరుగల్లు రాజకీయాలకు ఎంతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఆ మాటకొస్తే మహామహా ఘట్టాలు జరిగిన సమయంలో ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న నేతలు టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న బడాబడా నేతలంతా ఒకప్పుడు టీడీపీలోనే తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు, ఓ వెలుగు వెలిగారు. టీడీపీ 40 ఏళ్ల చరిత్ర సందర్భంగా పలువురు ప్రముఖులు ఎదిగిన క్రమాన్ని పరిశీలిద్దాం…
కడియం శ్రీహరి..
కడియం శ్రీహరి ప్రముఖ రాజకీయ నాయకుడు. తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి జన్మించారు. 2014-15 మధ్యకాలంలో వరంగల్ నియోజకవర్గం ఎంపీ గా ఉన్నారు. అంతకు ముందు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగారు. ఎన్టీయార్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో కడియం కేబినెట్ మంత్రిగా కొనసాగారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, జనరల్ సెక్రటరీగా కూడా వ్యవహరించారు. 1988 కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కి చైర్మన్ గా వ్యవహరించారు. 1987-1994 వరంగల్ జిల్లా తెలుగు దేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1994 టీడీపీ అభ్యర్థిగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఎన్టీయార్ తన మంత్రి వర్గంలో మార్కెటింగ్, సామాజిక సంక్షేమం, విద్య, నీటిపారుదల శాఖలు అప్పగించారు. చంద్రబాబు నాయుడి సర్కార్ లో కూడా మంత్రిగా చేశారు. కాగా, 2004 లో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయరామారావు చేతిలో ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం డిప్యూటీ సీఎంగా సేవలందించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
సత్యవతిరాథోడ్..
ఉమ్మడి వరంగల్ జిల్లా కురవి మండలంలోని గుండ్రాతిమడుగులో 1969, అక్టోబర్ 31న లింగ్యానాయక్, దశమి దంపతులకు జన్మించిన సత్యవతి రాథోడ్ 1984లో రాజకీయ ప్రవేశం చేసి సర్పంచ్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1985లో జిల్లా తెలుగు మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. టీడీపీ తరఫున 1989లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2007లో నర్సింహులపేట జడ్పీటీసీగా, 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా సత్యవతి గెలిచారు. 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలిగా ఉన్న సత్యవతి గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖమంత్రిగా కొనసాగుతున్నారు.
మేయర్ గుండు సుధారాణి..
గుండు సుధారాణి వరంగల్ జిల్లాకే చెందిన పూర్వపు తెలుగుదేశం ప్రముఖ నాయకురాలు. 2002 నుంచి 2004 వరకు టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2005 నుంచి 2010 వరకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. 2010 సంవత్సరంలోనే టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రత్యేక రాష్ట్రావిర్భావం తర్వాత 2015లో టీడీపీని వీడి, టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా సేవలందించారు. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కొనసాగుతున్నారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు..
ఎర్రబెల్లి దయాకర్ రావు 1956, జూలై 4న జగన్నాధరావు , ఆదిలక్ష్మీ దంపతులకు పర్వతగిరిలో జన్మించాడు. ప్రముఖ రాజకీయ కుటుంబం నుండి వచ్చాడు. ఎర్రబెల్లి దయాకర్ రావు 1983లో తొలిసారి శాసన సభ్యులుగా పోటీచేసి ఓడిపోయాడు. 1987లో వరంగల్ డీసీసీబీ అధ్యక్షునిగా పదవి లభించింది. వరంగల్ జిల్లాకు రేషన్ డీలర్స్ గౌరవ అధ్యక్షుడిగా చేశారు. 1994లో తొలిసారి టీడీపీ నుంచి శాసనసభకు ఎన్నికయ్యాడు. 2008 ఉప ఎన్నికలలో కూడా టీడీపీ నుంచి వరంగల్ ఎంపీగా విజయం సాధించాడు. వర్ధన్నపేట నుండి మూడుసార్లు శాసన సభ్యుడిగా, పాలకుర్తి నుంచి 2009, 2014లో టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. 2016లో టీడీపీ ని వీడి టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం 2018లో గెలుపొంది ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు.
వెలిగి మలిగిన తెలుగుదేశం..
RELATED ARTICLES
Recent Comments