Saturday, November 23, 2024
Homeజనరల్ న్యూస్అయ్య హాఫ్.. కొడుకు ఫుల్..

అయ్య హాఫ్.. కొడుకు ఫుల్..

అతిగా మద్యం సేవించిన పన్నెండేళ్ల బాలుడు
అత్యవసరంగా ఆస్పత్రిలో చేర్పించని బంధువులు
మధ్యప్రదేశ్ లో ఘటన
స్పాట్ వాయిస్, డెస్క్: ఆవు చేన్లో మేస్తే దూడ మాత్రం గట్టున మేస్తుందా ఏంది..? ముమ్మాటికి చేన్లనే మేస్తుంది. అచ్చు అలాగే ఉంది ఈ పిల్లల పరిస్థితి. తమ పెద్దలు ఆల్కహాల్ తాగడం చూసి, తామేం తక్కువ తిన్నామని వాళ్లు ‘ఫుల్లు’ గా లాగించేశారు. సరే తాగితే తాగిండ్రుగానీ, వయస్సేమో చిన్నది అవడం, లాగించిందేమో పెద్దమోతాదు కావడంతో గిర్రున తిరిగిపడిపోయారు. మధ్యప్రదేశ్లోని ఛతార్పుర్ జిల్లాలో జరిగిన ఘటన తాలుకు వివరాలే ఇవి.
నౌగాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్రి గ్రామంలో కుటుంబ పెద్దలంతా మద్యం సేవించడం పిల్లలంతా కళ్లారా చూశారు. అందులో ఏముందనుకున్నారో ఏమో, లేదంటే దాని రుచేంటో చూడాలనుకున్నారో గానీ, రాజు అనే పెద్దాయన పన్నేండేళ్ల కుమారుడు ఇంట్లోని ఓ మద్యం బాటిల్ ను తీసుకుని వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి స్నేహితులతో కలిసి ఫుల్లుగా ఆల్కహాల్ సేవించారు. పరిమితికి మించి మందు తాగడంతో ఆ అబ్బాయి అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. తక్కువగా తాగిన మరో బాలుడు అతి కష్టంగా ఇంటికెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. హుటాహుటీనా అక్కడకు చేరుకున్న రాజు అతడి కుటుంబ సభ్యులు పిల్లాడిని స్థానికంగా ఉన్న వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని తెలుపడంతో అక్కడ నుంచి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా, ప్రస్తుతం ఆ బాలుడు చికిత్స పొందుతున్నాడు. పెద్దరికం మరిచి పిల్లల ముందు తప్పులు చేస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి మరీ.., తండ్రులు మద్యం తాగితే, పిల్లలు మాత్రం మకరందం సేవిస్తారా ఏంది..?

RELATED ARTICLES

Most Popular

Recent Comments