యువత సన్మార్గంలో నడవాలి
ఏసీపీ శివరామయ్య
స్పాట్ వాయిస్,దామెర: యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా సన్మార్గంలో నడవాలని పరకాల ఏసీపీ శివరామయ్య సూచించారు. శనివారం రాత్రి మండలంలోని పసరగొండ గ్రామంలో ఎస్సై హరిప్రియ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటి సోదాలు నిర్వహించి బెల్ట్ షాపులపై దాడి చేశారు రూ. 4970 విలువ గల మద్యం సీసాలను,మూడు అంబర్ పాకెట్లను స్వాధీన పర్చుకొని కేసులు నమోదు చేశారు.అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎసీపీ శివరామయ్య గ్రామస్తులకు 4జీ కి సంబంధించిన గుట్కా, గంజాయి, గ్యాంబ్లింగ్, గుడంబా పైన అవగాహన కల్పించారు.చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే సైబర్ నేరాలపై అవగాహన,సీసీ కెమెరాల ప్రాధాన్యత, 100 డయల్ యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాంబయ్య,ఎంపీటీసీ కళా సుధాకర్, దామెర,ఆ త్మకూర్ సీఐ లు రమేష్ కుమార్, గణేశ్, ఎస్సై లు హరిప్రియ, ప్రసాద్, వీరభద్రరావు,ప్రసాద్,సుమన్,శివకృష్ణ, ఏఎస్సై లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments