పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసనలు
మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు ఆందోళనలు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: పెట్రో, గ్యాస్, విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై తీవ్ర భారం పడుతోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రేస్ ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు ద్రవ్యోల్బణం ఇంధన ధరల పెంపుకు వ్యతిరేకంగా నిరసనలు, బైక్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. దిష్టిబొమ్మల దహనం, కలెక్టర్ల ఆఫీసుల ముట్టడి చేయనున్నట్లు చెప్పారు. కరోనాతో కోట్లాది మంది ఉపాధి కోల్పోయారని ఇలాంటి క్లిష్ట సమయంలో ధరలు పెంచడం దారుణమన్నారు. ఏప్రిల్ -1 నుంచి విద్యుత్ చార్జీలు పెంచడంతో రూ. 5,596 కోట్లు పేదల నుంచి గుంజుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. సర్ చార్జీల పేరుతో ఇంకో రూ. 6 వేల కోట్లు లాక్కుంటుదన్న రేవంత్ రెడ్డి ఆరోపించారు. దళిత కాలనీలకు ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన సర్కార్ ఇప్పుడు చార్జీలు పెంచుకుంటూ పోతున్నదని విమర్శించారు. జీడీపీకి రేవంత్ రెడ్డి కొత్త నిర్వచనం చెప్పారు. G-గ్యాస్, D-డీజిల్, P- పెట్రోల్ అన్నారు. ఈ మూడింటి ధరలు పెరగడమేనా జీడీపీ అని ప్రశ్నించారు. ఈ దోపిడిని అరికట్టేందుకే ఏఐసీసీ ఆదేశాలతో 31న నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఏప్రిల్ 7 వరకు కొనసాగుతాయన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కేసీఆర్, మోడీ దోపిడీలను నిలదీయాలన్నారు.
జీడీపీ అంటే.. G-గ్యాస్, D-డీజిల్, P- పెట్రోల్
RELATED ARTICLES
Recent Comments